Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర యాంకర్ గా ఒకానొక సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా వెండి తెరపై కూడా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మెప్పించారు. ప్రస్తుతం ఝాన్సీ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ వెండితెరపై మాత్రం కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈమె సలార్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మరి కొద్ది రోజులలో ఈ ఏడాది పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో ఈమె ఈ ఏడాదిలో తనకు జరిగినటువంటి విషాదాలు గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ ఏడాదిలో తనకు ఎంతో ఆప్తులు అయినటువంటి వారందరినీ కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ వెల్లడించారు. ఈ సంవత్సరంలో డాడీ, బడ్డీ, శ్రీను వెళ్లిపోయారు.. 2023 కన్నీటిని మిగిల్చింది.. ప్రేయర్స్ అంటూ వారి ముగ్గురి ఫోటోలను షేర్ చేసుకున్నారు. తన తండ్రితో పాటు వీరు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి తన పెంపుడు కుక్క బడ్డీ కూడా చనిపోయిందని ఈమె తెలిపారు.
విషాదం నింపింది…
ఇక తన పిఏ శ్రీను కూడా ఈ ఏడాది గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఈయన మరణించడంతో ఈమె ఆయన మరణం పట్ల ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనకు ఎంతో ఆప్తులు అయినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ ఏడాది చనిపోవడంతో ఈమె ఎమోషనల్ అవుతూ వారి మరణాలను తలుచుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

































