జబర్దస్త్, ఢీ వంటి ప్రోగ్రామ్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఒక వ్యక్తిపై రష్మీకి చాలా కోపం వచ్చింది. ఆ వ్యక్తిపై నిప్పు చెరిగింది. అసలు వాడు మగాడే కాదు అంటూ తీవ్ర కోపంతో కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన పనేంటి అనే కదా… కుక్కను కొట్టాడు. అవును ఆ యువకుడు కుక్కను కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అసలే కుక్కలంటే అమితమైన ప్రేమ చూపించే రష్మీ ఈ వీడియో చూడగానే కోపంతో రగిలిపోయింది.

వివరాల్లోకి వెళితే…. ఢిల్లీకి ప్రాంతంలోని బ్రీజ్ పురి లోని ఒక వ్యక్తి బైక్ మీద వెళుతుండగా అతడిని చూసి ఒక కుక్క మొరిగింది. తనను చూసి మొరిగిందనే కోపంతో ఆ యువకుడు ఆ కుక్క వెంటపడి తరిమాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మిగిలిన కుక్కలు మరియు కుక్క పిల్లలను కొట్టాడు. అంతటితో ఆగకుండా కర్రలు, బెల్టులతో ఒక గ్యాంగ్ ను తీసుకునివచ్చాడు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో చుసిన రష్మీ కి కోపం నషాళానికి తాకింది, దీనితో తిట్టడం మొదలెట్టింది. “వీడు అసలు మగాడే కాదు… వాడి మగతనం నోరులేని మూగజీవాల మీద చూపిస్తాడా?” అంటూ కోపంతో రగిలిపోయింది. ఇటువంటి వారికి తగిన బుద్ది చెప్పాలని అభిప్రాయ పడింది.
































