బిగ్ బాస్ షోకు వెళ్లి.. అనూహ్యంగా 12 వ వారమే యాంకర్ రవి ఎలిమినేట్ కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఫైనల్ కంటెస్టెంట్లలో ఒకడిగా ఉంటారని అందరూ అంచానా వేసినప్పటికీ .. మధ్యలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. యాంకర్ గా పీక్ స్టేజీలో ఉండీ.. బిగ్ బాస్ షోకు వెళ్లడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ షోకు వెళ్లి యాంకర్ రవి తన ఇమేజ్ ని డ్యామెజ్ చేసుకున్నాడు.

మొదట నుంచి హౌజ్ లో ఇతరును డామినేట్ చేయడానికి చూశాడని నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌజ్ లో అందరిని కలుపుకోని పోవడానికి ట్రై చేశాడు రవి.. కానీ ఇదే నెగిటివ్ గా మారింది. ఇదిలా ఉంటే చాలా మంది నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ రచ్చలోకి రవి కూతరు వియాను కూడా లాగారు. అయితే తన మీద, తన కుటుంబం మీద వస్తున్న ట్రోలింగ్ ను భరించలేకపోయాడు రవి.
24 గంటల్లో మీకు చూపించేది గంట మాత్రమే.. దాంట్లోనే నన్ను నెగిటివ్ గా చూపించారని చెప్పుకున్నా… రవిపైన ట్రోలింగ్ ఆగలేదు. ట్రోలింగ్ పై రవి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది. నువ్వు గర్వపడటానికి అది(సిరి) ఇండియాకి పతకం తీసుకురాలేదు. నానా పనులు చేసి టాప్ 5కి వచ్చింది. సిగ్గుందా? ఇంట్లో మా పిల్లలకు టీవీ చూపించాలంటేనే భయమేస్తోందంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ షో రవి ప్రదర్శనపై ఘాటుగా విమర్శలు చేసిన ప్రియంక రెడ్డి అనే నెటిజెన్.. వియాకు కూడా ఇలాంటివే నేర్పిస్తావా.. ఆ షణ్ముఖ్‌ని తమ్ముడు అంటావ్.. సిగ్గుందా కొంచెమైనా? నువ్వు ఫ్రెండ్‌షిప్ పేరుతో ఇలానే చేస్తున్నవా? అని కామెంట్ చేసింది. దీనిపై ఘాటుగానే స్పందించిన రవి .. నోరు అదుపులో పెట్టుకోండీ.. మీపై నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా..అని రిప్లై ఇచ్చాడు. ఇప్పటి దాకా భరించింది చాలని.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిని సైబర్ క్రైమ్ పోలీసులు శిక్షిస్తారని.. వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని రవి స్పష్టం చేశాడు.































