బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని.. 5 వ సీజన్ కూడా పూర్తి చేసుకోవడానికి మరో మూడు వారాల దూరంలో ఉంది. అయితే ప్రతీ వారం ఓ కంటెస్టెంట్ బయటకు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సారి 5 వ సీజన్లో 12వ వారం ఎలిమినేటర్ గా బయటకు వచ్చిన యాంకర్ రవి విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు తప్పుచేశారని రవి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియో వద్ద ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అనే నినాదాలు మిన్నంటాయి. జనాలు కూడా ఇది ఫేక్ ఎలిమినేషన్ అని.. టాప్ 5 లో ఉండాల్సిన రవిని బయటకు పంపించడం కరెక్ట్ కాదంటూ.. దుమ్మెత్తి పోస్తున్నారు. అలాంటప్పుడు ప్రేక్షకులను ఓట్లు ఎందుకు అడుగుతున్నారు.. ఇవి పరిగణలోకి తీసుకోవడం లేదు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
జనాల్ని పిచ్చోళ్లని చేసి బాగా ఆడేవాళ్లని ఎలిమినేట్ చేస్తూవస్తున్నారన్నారు. మొత్తంగా యాంకర్ రవి ఎలిమినేషన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే షాకింగ్ ఎలిమినేషన్ లా మారింది. ఇంతక ముందు ఎప్పుడూ లేని నిరసనలు యాంకర్ రవి విషయంలో చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి నాగార్జున దగ్గర నిల్చొని యాంకర్ రవి.. హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోటివేట్ చేశాడు. అక్కడ హౌస్ లో ఉన్న 7గురులో ఎవరు పాస్.. ఎవరు ఫెయిల్ అనే దానికి సమాధానం ఇచ్చాడు.
షణ్ముఖ్, సన్నీ, శ్రీరామచంద్ర పాస్ అంటూ చెప్పి.. మిగతా వాళ్లంతో ఫెయిల్ అంటూ చెప్పాడు. అందరి గురించి మాట్లాడితన తర్వాత రవికి గుడ్ బయ్ చెప్పేయండి అంటూ నాగార్జున అనగానే.. షణ్ముఖ్ జస్వంత్ ఎమోషనల్ అవుతాడు. ‘నో.. సార్ అతను వెళ్లకూడదు సార్’ అని అన్నాడు ఆ టైంలోనే రవి విన్నర్ విషయాన్ని బయటపెట్టాడు. నేను వెళ్తేనే నువ్వు విన్నర్ అవుతావు షణ్ణు అంటూ పరోక్షంగా విన్నర్ ను చెప్పేశాడు.


































