బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే 12 వారాలు పూర్తి చేసుకుంది.ఈక్రమంలోనే 12 వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ యాంకర్ రవి హౌస్ నుంచి బయటకు వచ్చారు. సన్నీ ఎవిక్షన్ పాస్ ఉండగా ఆఖరి నిమిషంలో తనని ఎంతో సపోర్ట్ చేసిన కాజల్ కి ఉపయోగించడంతో తక్కువ ఓట్లు రవికి రావడం వల్ల అతను ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

ఇక యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ రవి హౌస్ ని వీడి వదులుతుంటే ఏమోషనల్ అయ్యారు.రవి ఎలిమినేట్ కావడంతో ఎంతో ఎమోషనల్ అయిన సన్నీ తనకు వచ్చిన గిఫ్ట్ వోచర్ ను తనకు బహుమతిగా ఇచ్చి పంపించారు.
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రవి హౌ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రవికి నాగార్జున ఫెయిల్ పాస్ అనే గేమ్ ఆడాడు ఇందులో రవి షన్ను ,సన్నీ, శ్రీరామ్ కి ఫాస్ టాగ్ ఇవ్వగా.. సిరి కాజల్ ప్రియాంక మానస్ లకు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చారు. రవి ఈ విధంగా చెప్పడంతో షన్ను ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే లేచి తనని బాధపెట్టి ఉంటే క్షమించనీ షన్ను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇక షణ్ముక్ ఎంతసేపటికి కనీళ్ళు ఆపకపోవడంతో రవి తనకు సపోర్ట్ చేస్తూ లోపలి నుంచి నువ్వు ఆడు బయట నుంచి నేను ఆడతా.. నేను హౌస్ నుంచి వెళ్తేనే నువ్వు గెలుస్తావు అంటూ చివరి వీడ్కోలు చెబుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లారు.
































