ప్రేమలో పడిన యాంకర్ శ్రీముఖి.. అబ్బాయి ఎవరంటే..?

0
140

బుల్లితెర షోలతో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ప్రేమలో పడిందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె డేటింగ్ లో ఉందని రెండేళ్ల తర్వాతపెళ్లి జరగనుందని తెలుస్తోంది. పటాస్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి బిగ్ బాస్ షో లో రన్నర్ గా మరింత పేరు, గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి శ్రీముఖి పటాస్ షోకు దూరమయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాంకర్ గా చేసే షోల గురించి, ఇతర విశేషాల గురించి శ్రీముఖి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గతంలో ఒక ప్రోగ్రామ్ లో శ్రీముఖికి పెళ్లి ఎప్పుడు…? అనే ప్రశ్న ఎదురు కాగా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రెండు సంవత్సరాల తర్వాత యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతానని అన్నారు. అయితే శ్రీముఖి ప్రేమించిన అబ్బాయి సినిమా, టీవీ రంగాలకు చెందిన వ్యక్తి కాదని తెలుస్తోంది.

శ్రీముఖి ఇష్టపడుతున్న అబ్బాయి ఎవరో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీముఖి బొమ్మ అదిరింది షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. యూట్యూబ్ లో ఓ ఉమానియా పేరుతో శ్రీముఖి టాక్ షోను చేస్తూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. శ్రీముఖి డేటింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యాంకర్ గా వ్యవహరించడంతో పాటు శ్రీముఖి అడపాదడపా సినిమాల్లో సైతం నటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఒక థ్రిల్లర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే శ్రీముఖి వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించాల్సి ఉంది. శ్రీముఖి స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here