టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ జోడి లో రాజీవ్ కనకాల-సుమ జోడి ఒకటి అని చెప్పవచ్చు. రాజు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిస్తుంటే, సుమ కూడా గత రెండు దశాబ్దాల నుంచి వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తన దైన శైలిలో గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ జంట వ్యక్తిగత జీవితంలో పలు మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది.

గత కొంతకాలం నుంచి సుమా రాజీవ్ వైవాహిక జీవితంలోపలు మనస్పర్థలు చోటు చేసుకోవటం వల్ల ఇద్దరు వేరువేరుగా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. తాజాగా ఈ విషయంపై రాజీవ్ కనకాల స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.
వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. సుమ నేను వేరువేరుగా ఉంటున్నామనే వార్తలు వినిపిస్తున్నాయి. అవును నిజంగానే మేమిద్దరం వేరు వేరు ఇంట్లో ఉంటున్నాము. అయితే మా మధ్య మనస్పర్థలు తలెత్తి విడిగా ఉండటం లేదని తెలిపారు.
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గారు గురించి మనకు తెలిసిందే. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. అయితే నాన్నను అక్కడినుంచి తీసుకు రావాలనుకుంటే నాన్నకు పెద్ద బుక్ లైబ్రరీ ఉండేది. దానిని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే వీళ్ళు పడకపోవడంతో నాన్న గారి కోసం నేను మణికొండలో ఉన్న ఇంటిలోనే వుండే వాడిని, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని అసలు విషయాన్ని బయటపెట్టారు.


































