Anchor Suma: చివరికి ఆకులను ఆహారంగా మార్చుకున్న సుమ…అంత కష్టం ఏమొచ్చింది సుమక్క?

0
41

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా స్థిరపడ్డారు. అయితే కెరీర్ మొదట్లో ఈమె పలు బుల్లితెర సీరియల్స్ లో నటించారు. అలాగే కొన్ని సినిమాలలో కూడా కీలక పాత్రలలో కనిపించారు.

అయితే ప్రస్తుతం సినిమాలకు బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి సుమ యాంకర్ గా మాత్రం ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జరగాలన్న అక్కడ సుమ ఉండాల్సిందే అలాగే సినిమా విడుదలవుతుంది అంటే సుమతో ఒక ఇంటర్వ్యూ ఉండాల్సిందే అనేలా దర్శక నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అభిమానులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన సుమ అక్కడ వివిధ రకాల ఆకులతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేశారు.

Anchor Suma: ఆకులను మనుషులు కూడా తింటారు…


ఈ విధంగా సుమ ఈ డిష్ అందరికి చూపిస్తూ పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఆకులు తింటది మేక మేకను తింటది పులి అనే డైలాగ్ పుష్ప సినిమాలో ఉంది ఆకులను మేక మాత్రమే కాదు మనం కూడా తింటున్నాము అంటూ ఈమె కామెడీ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి అభిమానులు ఇలా ఆకులు తినాల్సిన కష్టం నీకేం వచ్చింది సుమక్క అంటూ కామెంట్ చేస్తున్నారు.