Movie News

Anchor Suma: యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనన్న సుమ.. సుమ నిర్ణయంతో షాక్ లో అభిమానులు!

Anchor Suma: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు.బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలలో నటించారు. ఇక గత ఏడాది జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో సుమ నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా యాంకర్ గా బుల్లితెర పై ప్రసారమవుతున్న ప్రతి ఒక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సుమ ప్రస్తుతం సినిమా ఈవెంట్లతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. సినిమాకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా అక్కడ తప్పనిసరిగా సుమ ఉండాల్సిందే. ఇలా వారంలో ఏడు రోజులపాటు నిత్యం ఎంతో బిజీగా గడిపే సుమ తన యాంకరింగ్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఏదైనా పండుగలు వచ్చిన స్పెషల్ డే వచ్చిన ఈటీవీ ఛానల్ ఎంతో ఘనంగా స్పెషల్ ఎపిసోడ్లను నిర్వహించే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నూతన సంవత్సరం కానుకగా వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని సందడి చేశారు.

Anchor Suma: బ్రేక్ ఇవ్వాలనుకున్నాను…


ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమకు సన్మానం చేశారు. అయితే ఈకార్యక్రమంలో సుమ మాట్లాడుతూ తాను కొద్ది రోజులపాటు యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ సుమ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే నిజంగానే సుమ యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనుందా లేకపోతే ఎపిసోడ్ హైలైట్ కోసం ప్రోమో ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

1 minute ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

31 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

48 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

56 minutes ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

1 hour ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago