Anchor Udaya Bhanu: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే టక్కున అందరికీ సుమ పేరు గుర్తుకు వస్తుంది సుమ తర్వాత అనసూయ రష్మి వంటి వాళ్ళు గుర్తుకు వస్తారు.అయితే వీరి కన్నా ముందు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ ఉదయభాను ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో నటిగా తన ప్రయాణం మొదలుపెట్టిన అనంతరం యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభాను ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం తన వ్యక్తిగత విషయాలేనని తెలుస్తుంది. ఈమె పెళ్లి కాకపోతే ఓ ముస్లిం వ్యక్తితో అఫైర్ కొనసాగించారనీ,రహస్యంగా తనని వివాహం చేసుకొని కొద్ది రోజుల తర్వాత విడిపోయారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ, ఈమె యాంకర్ అయిన తర్వాత తాను ఇండస్ట్రీలో ఎవరు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయారు.ఇలా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె విజయ్ అనే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడ్డారు. అయితే ఈమె తన కార్ డ్రైవర్ అని చాలామంది భావిస్తారు అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఇలా విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

Anchor Udaya Bhanu: ప్రేమ పెళ్లి వ్యవహారమే కారణమా…
అయితే ఈ పెళ్లి తన తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది ఇలా తన తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల ఏమి కెరియర్ లో కూడా కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇలా తన వ్యక్తిగత కారణాల వల్ల పలమార్లు ఈమె కెరియర్ ఇబ్బందులలో పడిందని,ఇక ప్రస్తుతం తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకుంటూ ఇండస్ట్రీకి మరోసారి బ్రేక్ ఇచ్చారు.ఇలా ఇండస్ట్రీలో గొప్ప స్థానంలో ఉండాల్సిన ఉదయభాను తన వ్యక్తిగత కారణాలవల్లే తన కెరియర్ నాశనం చేసుకుందని తెలుస్తోంది.































