బుల్లితెరపై అత్యంత రేటింగ్స్ తో దూసుకుపోతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకున్న తెలుగు బిగ్ బాస్ 5.. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమై ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమంలో నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 15 మందితో ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతుంది.

ఇదిలా ఉండగా గత సీజన్లోలో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతోంది. అయితే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ గా, ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న విష్ణుప్రియకి సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఐదవ వారం లేదా ఆరవ వారంలోగా ఈమెనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోనికి పంపించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని చెప్పవచ్చు.
ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెతో సంప్రదింపులు జరిపి రెమ్యూనరేషన్ విషయం గురించి మాట్లాడారని, త్వరలోనే ఈ బ్యూటీవైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఉందని తెలుస్తోంది.అయితే గతంలో ఎన్ని కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పిన విష్ణు ప్రియ నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందా.. లేదా.. అనే విషయం తెలియాల్సి ఉంది.































