YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో చెర్పించింది కాంగ్రెస్ కాదని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరున చార్జ్ షీట్ లో చేర్పించింది స్వయానా వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

షర్మిలా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి.తాను కేసుల నుంచి బయట పడేందుకు జగన్ కావాలని పిటీషన్ వేయించారంటూ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టు లో పిటీషన్ వేయించిందే జగన్ రెడ్డి అని వైఎస్ షర్మిల అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అదే పోన్నవోలుకి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని అన్నారు. వైయస్సార్ పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చడం వెనుక కాంగ్రెస్ హస్తం ఏమాత్రం లేదంటూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. అయితే ఇటీవల పులివెందుల బహిరంగ సభలో భాగంగా షర్మిలను ఉద్దేశించి పచ్చ చీర కట్టుకొని శత్రువుల ముందు మోకరిల్లారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కేసుల నుంచి బయటపడటం కోసం..
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైయస్ షర్మిలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఈమె అసలు విషయాలన్నింటిని బయటపెట్టి జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలే తన రాజకీయ పతనానికి కారణం కాబోతున్నాయని పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.





























