Anil Kumble: క్రికెటర్స్ అంటేనే మనకు ఎక్కువగా సిక్స్లు ఫోర్లు కొట్టే బ్యాట్ మెన్స్ మాత్రమే గుర్తుకు వస్తారు కానీ బౌల్లర్స్ గుర్తురారు. ఒక నికాసైన ఆటగాడిని పడగొట్టాలంటే బౌలర్ ఎంతో కీలకం. ఇలా ఒక మ్యాచ్ విజయవంతం కావడానికి బ్యాట్మెంట్స్ ఎంత కీలకంగా ఉంటారో బౌలర్స్ కూడా అంతే కీలకంగా ఉంటారని చెప్పాలి.
Advertisement
ఇలా బౌలింగ్లో ఎంతో నైపుణ్యం కలిగి ఎలాంటి బ్యాట్ మెన్స్ నైనా తన బౌలింగ్ తో భయపెట్టే వారిలో అనిల్ కుంబ్లే ఒకరు. ఇలా అనిల్ కుంబ్లే తన కెరియర్లో చేసినటువంటి ఒక త్యాగం పూర్తిగా కనుమరుగైపోయింది. ఇంతకీ ఈయన ఏం చేశారు అనే విషయానికి వస్తే. 2002, ఐదు టెస్టుల సిరీస్ కోసం సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటించింది.
ఈ విధంగా తొలి మూడు టెస్టులో పూర్తి అయ్యాయి నాలుగో టెస్ట్ కోసం సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా) వేదికగా నాలుగో టెస్టు జరిగింది. అనిల్ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. అప్పటికే.. విండీస్ పేసర్ మెర్విన్ డిల్లాన్ రాకాసి బౌన్సర్లతో మంచి కసితో ఉన్నారు. అనిల్ కుంలే బ్యాటింగ్కు రాగానే ఆయన తన బౌలింగ్ తో షార్ట్ పిచ్ బంతి కుంబ్లే దవడను బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా ఆకారం మారిపోయి రక్తం కారసాగింది.
గ్రౌండ్ లోకి వచ్చిన ఫిజియో అతడిని పరిశీలించి మైదానం వదిలి వెళ్లాలని చెప్పిన వినకుండా అలాగే బ్యాటింగ్ కొనసాగించారు. చివరికి డిల్లాన్ బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ అయ్యారు.మ్యాచ్ అనంతరం ఆయనకు ఎక్సరే తీయగా సర్జరీ చేయాలని చెప్పినప్పటికీ వినకుండా తదుపరి మ్యాచ్ ఆడటం కోసం ఆసక్తి చూపించారు. మ్యాచ్లో ఎలాగైనా గెలవాలంటే వికెట్లు పడగొట్టాలన్న కసి ఆయనలో కనిపించింది. ఇక భారత టీం ఈయనకు విశ్రాంతి తీసుకోమని చెప్పిన వినకుండా తలకు కట్టుతోనే ఆయన మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేశారు. ఇలా తలకు కట్టుతో నొప్పితోనే బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. ఆ సమయంలో ఈయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో.. వెస్టిండీస్ బ్యాటర్స్ క్రీజ్ లో పాతుకుపోయారు.
Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రానా ఇటీవల కాలంలో హీరోగా మాత్రమే కాకుండా కథ పాత్ర బలంగా ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో భల్లాళ్ల దేవుడి పాత్రలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
Advertisement
ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రానాని రాజమౌళి మరోసారి విలన్ ను చేయబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో త్వరలోనే మహేష్ బాబుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ఓ అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఇక ప్రభాస్ కు పెద్ద ఎత్తున పోటీ పడిన రానా మహేష్ బాబుకి కూడా గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. మరి రానా ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
విలన్ గా రానా.. ఇక రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. RRR సినిమాలోని ఒక పాటకు మాత్రమే ఆస్కార్ వచ్చింది కానీ ఈ సినిమా మాత్రం అన్ని విభాగాలలో ఆస్కార్ కు ఎంపిక అయ్యే విధంగా రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
Lavanya Tripathi: మెగా ఇంట్లోకి మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా అమ్మ కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
Advertisement
నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి పెద్దగా సినిమాలలో నటించలేదు.
ఇలా ఈ జంట పెళ్లి చేసుకొని దాదాపు ఏడాది అవుతున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఈ వార్త వైరల్ అవుతుంది. అతి త్వరలోనే లావణ్య త్రిపాఠి అమ్మగా ప్రమోట్ అవ్వబోతుందని తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ శుభవార్తను తన అత్తమామలతో లావణ్య త్రిపాఠి తెలిపారని సమాచారం. ఇలా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కాబోతున్న లావణ్య.. ఇకపోతే ఈమె తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ప్రకటించలేదు దీంతో ఇలాంటి విషయాలను అధికారకంగా ప్రకటిస్తేనే మంచిది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె తల్లి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక లావణ్య త్రిపాటి సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈయన మట్కా అనే సినిమా ద్వారా రాబోతున్నారు.
Chanti: ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన చలాకీ చంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చంటి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన బయట ఎక్కడా కనిపించలేదు.
Advertisement
బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అనారోగ్యానికి గురైన చంటి ఇప్పుడే కోలుకొని పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టారు. తాను తీవ్రమైన గుండెపోటుకు గురై హాస్పిటల్ పాలయ్యానని తెలిపారు. అలా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న తనని పరామర్శించడానికి కానీ నాకు సహాయం చేయడానికి గానీ ఏ ఒక్కరు ముందుకు రాలేదని తెలిపారు.
ప్రస్తుత కాలంలో డబ్బు ఉంటేనే మనం బ్రతుకుతాం ఎవరైనా మనల్ని పలకరిస్తారు. డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరని చంటి తెలిపారు. మన పరిస్థితి బాగా లేకపోతే స్నేహితులు ఎవరూ కూడా ముందుకు రారు. అందుకే ఎవరి దగ్గర డబ్బు ఆశించకుండా బ్రతకడం నేర్చుకోవాలని తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో చాలామంది నాపై నాకు తెలియకుండానే కుట్రలు చేశారని తెలిపారు.
జబర్దస్త్ లోకి రాను..
Advertisement
నా గురించి దర్శక నిర్మాతల వద్ద తప్పుగా చెబుతూ నాకు సినిమాలలో అవకాశాలు లేకుండా చేశారు. ఇలా ఎన్నో అవకాశాలను కోల్పోయానని నాకు ఇలా అవకాశాలు రాకుండా చేసిన వారు సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టారు. నేను బ్రతికుండగానే నన్ను ఇబ్బందులు పెట్టినవారు నాశనాన్ని నేను చూసి చనిపోవాలి అంటూ చలాకి చంటి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక తిరిగి జబర్దస్త్ కి మీరు వస్తారా అనే ప్రశ్న ఎదురు కావడంతో నేను రానని వాళ్లే వద్దన్నప్పుడు నేను మరోసారి అడగను అంటూ చంటి జబర్దస్త్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.