Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టార్ హీరో వెంకటేష్ దగ్గుపాటి కాంబినేషన్ లో గతంలో సినిమాలు విడుదల అయ్యి బ్యాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. సూపర్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు అనిల్ రావిపూడి. అయితే మళ్లీ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో ముచ్చటగా మూడోసారి సెట్ అయ్యింది.

చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా తెలుగు వారికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకీ అనిల్ 3 ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ ప్రాజెక్ట్ ను SVC58 గా నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్ర కథ ఒక మాజీ పోలీసు, అతని మాజీ ప్రేయసి, అతని భార్య చుట్టూ తిరిగుతుంది. ఇదొక ట్రై యాంగిల్ లైవ్ స్టోరీ, పైగా క్రైమ్ ఎంటర్‌టైనర్ అని మూవీ మేకర్స్ వెల్లడించారు.
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్…
శ్రీష్ నిర్మాత కాగా, దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే త్వరలో ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభం కానుంది. 2025 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు, ఇతర కాస్ట్ అండ్ క్రూపై అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది అని అభిమానులకు తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ కామెంట్ చేస్తున్నారు.



























