Anjana -Nazriya Nazim: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమా అన్ని హంగులను పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోని ఛమ్కీలా అంగీలేసి అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రేక్షకుల వరకు కూడా పెద్ద ఎత్తున రియల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట మనకు వినపడుతుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ పాటకు నాని సతీమణి అంజనా అలాగే నటి నజ్రియా నజీమ్ ఇద్దరూ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు. ఇక ఈ పాటకు సంబంధించిన ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anjana -Nazriya Nazim: దసరా ప్రమోషన్లలో భాగమైన నజ్రియా…
ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. సంతోశ్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. దీక్షిత అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. ఇక నాని నటించిన అంటే సుందరానికి సినిమా ద్వారా నటి నజ్రియా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా సమయంలోనే ఈమెకు నాని భార్య అంజనాతో మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఇద్దరు కలిసి ప్రమోషన్స్ చేశారు. తాజాగా దసరా సినిమా ప్రమోషన్లలో నజ్రియా కూడా భాగం కావడం విశేషం.





























