ఎంతో రచ్చరచ్చగా మొదలైన మా ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. కొందరు ఓడిపోయిన వారు తమకు తాము బాధ్యులగా రాజీనామాలు కూడా చేశారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్, నాగబాబులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. శివాజీ రాజా కూడా రాజీనామా ఇచ్చేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది.

వీరితో పాటు మరికొంతమంది అంతే హీరో శ్రీకాంత్ తో పాటు మరి కొంత మంది రాజీనామా సమర్పించేందకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచ పోటీ చేసిన ప్రతీ ఒక్కరు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కళకి భాషాభేదం లేదని చెప్పుకునే సినీ పరిశ్రమలో ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది. నాన్ లోకల్ అంటూ విష్ణు ప్రచారం చేయడం… దీంతో ప్రకాష్ రాజ్ కు 21 సంవత్సరాలుగా ఉన్న బంధాన్ని వదులుకున్నారు. మా ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ వాదానికి మధ్య జరిగాయని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఒకరికి ఒకరు రాజీనామాలు సమర్పిస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తాజాగా ప్రకాష్ రాజ్‌తో సహ మరికొందరు మా అసోసియేషన్ కి పోటీగా మరో అసోసియేషన్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ‘ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా) పేరుతో కొత్త అసోసియేషన్ ఉండనుందని సమాచారం. ఇక రాజీనామా చేసే వారిని బుజ్జగించేందుకు విష్ణు వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం. దీనిపై ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అయితే రాజీనామాలకు సిద్దపడిన వారిని విష్ణు వర్గం బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా ఉన్న వారంతా రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. నాగబాబు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.





























