Tollywood Star couple: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య ఏ ముహూర్తాన విడాకులు ప్రకటన చేశారో అప్పటి నుంచి వరుసగా పలువురు విడాకులు ప్రకటన చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

ఇలా సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన నుంచి అభిమానులు బయటపడకుండానే తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.ఎలా వీరి విడాకుల గురించి అందరూ షాక్ లో ఉండగానే మరొక స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

స్టార్ హీరో కుమార్తె విడాకుల విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్టు పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.అయితే వీరి పెళ్లి జరిగే కేవలం ఏడాది మాత్రమే అయినప్పటికీ వీరు విడాకులకు అప్లై చేశారని త్వరలోనే విడాకుల గురించి ప్రకటించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
పెద్దలు సర్ది చెప్పిన విడాకులకు మొగ్గుచూపుతున్న జంట..
కొన్ని సంవత్సరాల క్రితం ఓ యూత్ ఫుల్ కాలేజీ మల్టీస్టారర్ లో ఓ పాత్ర పోషించి, సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కొకొని హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో 2020 లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్ గా తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత ఇప్పటికే వీరిద్దరి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇరు కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణమని చెప్పినప్పటికీ ఈ జంట మాత్రం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అప్పుడే వీరిద్దరూ విడాకులు అది కూడా అప్లై చేశారని త్వరలోనే విడాకుల ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
































