ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటి దాకా లోలోపల జరిగిన ఈ వ్యవహారం.. ఇప్పుడు సదరు మహిళ మీడియా ముందుకు రావడంతో రచ్చకెక్కింది. “నన్ను నమ్మించి వంచించారు” అంటూ ఆమె చెబుతున్న మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఆ వివరాల్లోకి వెళ్తే…

ఫేస్‌బుక్ పరిచయం.. కారులో అత్యాచారం!
ఆ మహిళా ఉద్యోగి చెబుతున్న దాని ప్రకారం.. వీరిద్దరి పరిచయం ఫేస్‌బుక్ ద్వారా మొదలైందట. మొదటి రోజే ఏకంగా మూడు గంటల పాటు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు నిరంతరం టచ్‌లో ఉన్నారని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఒక రోజు కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారని బాంబు పేల్చింది. “ఉదయం అంతా పనిలో బిజీగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లోనే ఎమ్మెల్యేని కలిసేదాన్ని. ఒక ప్రజాప్రతినిధి కదా.. మంచివాడే అనుకుని వెళ్లాను” అని ఆమె మీడియా ముందు వాపోయింది.
ఐదుసార్లు అబార్షన్.. పెళ్లి పేరుతో మోసం?
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తన భర్తకు విడాకులు ఇస్తే, నిన్ను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ హామీ ఇచ్చారని ఆమె చెబుతోంది. ఆ మాట నమ్మి దాదాపు 15 నెలల కాలంలో ఏకంగా ఐదుసార్లు గర్భస్రావం చేయించుకున్నానని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. “ఆయనే నాకు ముందు ఐ లవ్ యూ చెప్పారు.. ఆ తర్వాతే నేను ప్రొసీడ్ అయ్యాను” అంటూ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి పూసగుచ్చినట్లు వివరించింది.
సోషల్ మీడియాలో సెటైర్లు.. అనుమానాలు!
ఈ ప్రెస్‌మీట్ చూసిన నెటిజన్లు మాత్రం రెండుగా విడిపోయారు. కొందరేమో ఎమ్మెల్యేను తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం ఈమె చెబుతున్న మాటల్లో లాజిక్ మిస్ అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా శ్రీధర్ తో ఇష్టపూర్వకంగా ఉండి…ఇప్పుడు మాత్రం ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతుందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయింది అని కొందరు అంటున్నారు.
- “15 నెలల్లో ఐదుసార్లు అబార్షన్ అంటే.. అది మెడికల్‌గా అసలు సాధ్యమేనా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
- ఇంకొందరైతే.. “ఇన్నాళ్లూ ఇద్దరూ ఇష్టపూర్వకంగానే తిరిగి, ఇప్పుడు తేడా వచ్చేసరికి అత్యాచారం అంటే ఎలా?” అని నిలదీస్తున్నారు.
- ఇక 25 కోట్ల రూపాయల సెటిల్మెంట్ వ్యవహారం కూడా బయటకు రావడంతో.. సానుభూతి కాస్తా అనుమానంగా మారుతోంది. “ఆయనే నాకు 25 కోట్లు ఇవ్వాలి.. పైగా నేనే ఆయనకు 7 లక్షలు అప్పు ఇచ్చాను” అని ఆమె చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దర్యాప్తులో తేలాల్సిందేంటి?
ఈ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కాక రేపుతోంది. ఒక మహిళా ఉద్యోగి ఇంత బహిరంగంగా ఆరోపణలు చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఆయన నోరు విప్పితే తప్ప అసలు నిజాలు ఏంటో బయటపడేలా లేవు.
పెళ్లి పేరుతో మోసమా? లేక సెటిల్మెంట్ గొడవలా? అనేది తేలాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్‌డేట్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి!




























