మౌనరాగం, మనసు మమత ఫేమ్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల విచారణలో గంటకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసులో ప్రధాన నిందితుని విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేవరాజ్ సాయికృష్ణపై సాయికృష్ణ దేవరాజ్ పై ఆరోపణలు చేయడంతో పాటు ఆ ఆరోపణలకు సాక్ష్యాలను చూపుతున్నారు. తాజాగా సాయికృష్ణ మీడియాకు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమంటూ కీలక ఆధారాలను బయటపెట్టాడు.

దేవరాజ్ రెడ్డి శ్రావణిని మానసికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దేవరాజ్ కు శ్రావణి టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయమైందని… దేవరాజ్ శ్రావణిని మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడని… ప్రేమలో మోసపోవడం వల్ల ఆ మోసాన్ని తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని … తనపై దేవరాజ్ తప్పుడు సాక్ష్యాలను పుట్టిస్తున్నాడని తెలిపాడు.

దేవరాజ్ శ్రావణితో పాటు మరి కొంతమంది అమ్మాయిలను, ఆంటీలను వేధించాడని…. అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేయడమే దేవరాజ్ పని అని సాయికృష్ణ తెలిపాడు. శ్రావణి తనకు దేవరాజ్ వేరే అమ్మాయిలతో మాట్లాడిన ఆడియోలు, దేవరాజ్ వేరే అమ్మాయిలతో ఉన్న వీడియోలు ఇచ్చిందని సాయికృష్ణ చెప్పాడు. నిర్మాత అశోక్ రెడ్డిని దేవరాజ్ కావాలనే ఇరికించాడని అన్నాడు. 

దేవరాజ్ శ్రావణిని వేధిస్తుంటే అతనికి వార్నింగ్ ఇచ్చానని.. శ్రావణిని తానెప్పుడూ వేధించలేదని సాయికృష్ణ పేర్కొన్నాడు. శ్రావణి తల్లిదండ్రులకు కూడా శ్రావణితో తన పెళ్లి ఇష్టమేనని…. శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో తమ పెళ్లి జరిగేదని అన్నాడు. పోలీసులకు సాయికృష్ణ ఎలాంటి ఆధారాలు చూపిస్తాడో… ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here