Anasuya: అనసూయ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ వెండి తెర నటిగా బిజీగా ఉన్నారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈమె మాట తీరుకు ఎంతోమంది అభిమానులు మారిపోయారు.

ఇక ఈ కార్యక్రమం కోసం అనసూయ వేసే వస్త్రధారణ కారణంగా కొన్నిసార్లు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా పొట్టి బట్టలు వేసుకుందంటూ ఈమెపై చాలామంది విమర్శలు చేయగా వారికి తన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ సమాధానాలు చెప్పేవారు. నా దుస్తులు నా ఇష్టం చెప్పడానికి మీరు ఎవరు అంటూ ఘాటుగా స్పందించేవారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న ఈమె అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం వెండి తెర పై వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె తిరిగి త్వరలోనే బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాకి దూరం..
ఇక ఏ విషయమైనా ఎంతో నిక్కచ్చిగా మాట్లాడుతూ ఎవరికీ తలవంచను అనే ధోరణిలో ఉండే అనసూయ మొదటిసారి క్షమాపణలు చెప్పారు. సారీ నన్ను క్షమించండి అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈమె ఎవరికీ సారి చెప్పారు అనే విషయానికి వస్తే తన అభిమానులకి అని చెప్పాలి. గత కొద్దిరోజులుగా పని ఒత్తిడి కారణంగా ఈమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నందుకు తనని క్షమించాలి అంటూ అభిమానులను ఈమె క్షమాపణలు కోరుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.



























