Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళికి సినిమా అంటే ఎలాంటి ఫ్యాషన్ ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఇదివరకు ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇక ఈ చిత్ర బృందం ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని వీక్షించారు.ఇదే సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే కీరవాణి కుటుంబ సభ్యులకు కూడా అదే థియేటర్లో సినిమా చూశారు.

సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ దగ్గర చేరుకోగానే అక్కడ వీరిని చూసిన అనుపమ పరమేశ్వర ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఆశీర్వదించిన రాజమౌళి సినిమా చాలా బాగుందని తన నటన మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
Anupama Parameswaran: సినిమాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కీరవాణి కుటుంబ సభ్యులను కూడా అనుపమ పరమేశ్వరన్ పరామర్శించారు. ఇక ఈ విషయాన్ని ఈమె తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుపమ వ్యవహారంపై నేటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Hearing positive about #karthikeya2 #anupamaparameswaran takes blessings from Ace Indian director #ssrajamouli at #karthikeya2 screening@ArtistryBuzz @anupamahere #southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/zCCy7uIsDf
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 13, 2022































