Prabhas-Anushka: సినీ ఇండస్ట్రీకి హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే లాంగ్ స్టాండింగ్ గా ఉండగలుతారు. అందులో కూడా కొంతమందికి మాత్రమే స్టార్ స్టేటస్ వస్తుంది. వారిని చూసే సినిమాకు వెళ్తుంటారు అభిమానులు. ఇదిలా ఉంటే లేడీ ఓరియంట్ సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలు చేసే హీరోయిన్లు చాలా తక్కువగానే ఉంటారు.

అలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ అనుష్క శెట్టి. తన గ్లామర్ తో దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా… ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తోంది. అనుష్క కెరీర్ ‘ అరుంధతి’ సినిమాకు ముందు, దాని తర్వాతగా చూస్తుంటారు. కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క తన నటవిశ్వరూపాన్ని చూపించింది.

ఆ తరువాత వరసగా సినిమాలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి1, బాహుబలి 2తో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అప్పటి వరకు సౌత్ కే తెలిసిన అనుష్క ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ గా మారింది.
ప్రభాస్- అనుష్కల మధ్య ప్రెండ్షిప్ కొద్ది మాత్రమే…
ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఇటీవల ఓ ఫంక్షన్ లో కనిపించింది. అయితే ఇది కృష్ణంరాజు స్టాఫ్ కుమార్తె పెళ్లిక. దీనికి హాజరైన అనుష్క పెళ్లి పను చేస్తున్న ఓ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే అనుష్క- ప్రభాస్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ రూమర్లు కూడా వచ్చాయి. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పడు ఈ పిక్ వైరల్ కావడం అది కూడా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లోని ఫంక్షన్ కావడంతో మళ్లీ అనుమానాలు వస్తున్నాయి ప్రేక్షకులకి. అయితే ప్రభాస్- అనుష్కల మధ్య ప్రెండ్షిప్ కొద్ది మాత్రమే ఫంక్షన్ కు వచ్చిందంటూ మరికొంత మంది అనుకుంటున్నారు. ఇక రెండేళ్ల తరువాత మళ్లీ అనుష్క మళ్లీ తెరపై కనిపించబోతోంది. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్ లో అనుష్క బరువు తగ్గి స్లిమ్ గా మారింది. దీంతో షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు.
































