ఆ పనులు చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఫోటోలు వైరల్!

0
185

ఇండియన్ టాప్ సెలబ్రిటీస్ లో ఒకరైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ అనుష్క శర్మ వీరిద్దరు ఏం చేసినా అది సెన్సేషనల్ గా మారుతుంది. వీరు చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వీరు తాజాగా కోహ్లీ తన షూస్ శుభ్రం చేసుకుంటున్న ఫోటోను అనుష్క షేర్ చేశారు.

త్వరలో ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ ఎంతోశ్రద్ధగా తనషూస్ ని శుభ్రపరచుకుంటూ ఆ ఫోటోలో మనకు కనిపిస్తాడు.”మట్టి తో ఉన్న తన షూస్ ని విరాట్ ఎంతో శ్రద్ధగా క్లీన్ చేస్తున్నాడు”అని క్యాప్షన్ తో ఆ ఫోటోను అనుష్క శర్మ తన ఇన్‌స్ట్రా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు ఏంటి! కోహ్లీ ఇలాంటి పనులు కూడా చేస్తాడా…. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ హోటల్ లో ఉన్న ఈ జంట ఎంతో సరదాగా గడుపుతున్నారు. దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన కోహ్లీ టూర్ చివరిలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలిపారు.

తన భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నేపథ్యంలో తన డెలివరీ జనవరిలో ఉండగా అనుష్కకు డెలివరీ సమయంలో తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ చివరిలో తిరిగి ఇండియాకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయానికి బీసీసీఐ కూడా అంగీకారం తెలిపింది.

కోహ్లీ తీసుకున్న ఈ సెలవులపై నెటిజన్లు పలురకాలుగా స్పందించి కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ తన ఆనందకరమైన క్షణాలను గడపడం కోసం ఇండియాకు తిరిగి రావడం ఎంతో మంచి నిర్ణయం అని, కోహ్లీ తన వృత్తిపరంగా కంటే వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ సెలవులతో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టు తర్వాత ఇండియాకి రావడంతో భారత జట్టుకు కొంతవరకు కఠినతరం కావచ్చని మరి కొందరు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here