సినిమా ఇండస్ట్రీ అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది సినీ తారలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ ద్వారా కమిట్మెంట్ ఇస్తేనే..వారికి ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలదొక్కుకుంటారు అని చెబుతుంటారు.

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒకవైపు గ్లామరస్ పాత్రలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విశేష ఆదరణ పొందిన స్వీటీ సినిమా ప్రమోషన్ లో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. మీరు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అన్న ప్రశ్న ఆమెకు ఎదురవడంతో ఈ విషయం గురించి అనుష్క ఎంతో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న మాట వాస్తవమే అయినప్పటికీ నా వరకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నా పనేదో నేను చూసుకుంటాను అందువల్ల నాతో మాట్లాడడానికి చాలామంది సాహసించేవారు కాదని తెలియజేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలో తొందరగా గుర్తింపు పొందాలని అడ్డదారులను వెతుక్కుంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలబడలేమని కష్టపడి సంపాదించిన గుర్తింపు వారికి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు మనుగడ తీసుకువస్తుందని సూచించారు.

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఏ విధమైనటువంటి సినిమాలు ప్రకటించకుండా దూరంగా ఉండడంతో ఈమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు పెద్దఎత్తున చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా అనుష్క చంద్రముఖి 2 లో నటించబోతున్నారని ఇందులో లారెన్స్ హీరోగా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.






























