Anushka Shetty: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న స్వీటీ.. అదే ఆఖరి మిత్రమా?

0
42

Anushka Shetty: స్వీటీ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ అనుష్క శెట్టి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. స్వీటీగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె అనంతరం అనుష్కకగా మారిపోయారు. సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారని చెప్పాలి.

కెరియర్ మొదట్లో గ్లామరస్ పాత్రలలో నటించిన అనుష్క అనంతరం అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో అనుష్క తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించారు. అయితే సైజ్ జీరో సినిమాలో ఈమె నటించి అధిక శరీర బరువు కావడంతో ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయారని చెప్పాలి.

ఇలా శరీర బరువు తగ్గడం కోసం అనుష్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఈ విధంగా శరీర బరువు తగ్గినటువంటి అనుష్క అనంతరం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పానుండి స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anushka Shetty: సినిమాలకు అనుష్క గుడ్ బై…

ఈ సినిమానే అనుష్కకు ఆఖరి సినిమా అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని భావించారట అందుకే ఈ సినిమా విడుదలైన అనంతరం ఈమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ ఓ వార్త సెన్సేషనల్ గా మారింది. ఇలా వెండి తెర జేజమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇకపై వెండితెరపై కనిపించదు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన నిరాశ వ్యక్తం చేస్తున్నారు.