AP: 2019 ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపీ పార్టీ అఖండమైన విజయాన్ని సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే .ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకు అందేలా చేశారు.

ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. గోన సంచలు మోసే ఉద్యోగం అంటూ విమర్శలు కురిపించారు. ఇక తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థని ప్రధాన అంశంగా చేసుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ ప్రభుత్వం ఐదువేల రూపాయల జీతం ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్లు విధులలో ఉండకూడదని వారి చేత రాజీనామాలు చేయించారు అయితే ప్రస్తుతం రాజీనామా చేసిన వారిని తీసుకోవడానికి వీలు లేదంటూ తెలియజేశారు. దీంతో ఎంతో మంది వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, తిరిగి వాలంటీర్లుగా మమ్మల్ని తీసుకోవాలని వేడుకుంటున్నారు.
కేసులు పెట్టండి..
ఈ క్రమంలోనే వాలంటీర్ల పట్ల పలువురు మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా అచ్చం నాయుడు అప్పుడు మీతో ఎవరైతే రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా మరో మంత్రి రాజీనామా చేసిన వారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదంటూ వెల్లడించారు. ఇలా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ పై ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వాలంటీర్లలో అయోమయం చోటుచేసుకుంది.





























