ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కేబినేట్ సమావేశం జరగగా ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ కేబినేట్ ఆర్టీజీఎస్‌ ద్వారా ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఏ సీజన్ లో పరిహారం ఇకపై ఆ సీజన్ లోనే చెల్లించనుంది.

డిసెంబర్ నెల 31వ తేదీలోగా నివార్ తుఫాను బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన 1200 కోట్ల రూపాయల బకాయిలను జగన్ సర్కార్ చెల్లించనుంది. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16 వేల కోట్ల రూపాయల నిధులను జగన్ సర్కార్ రాష్ట్రంలోని 27 మెడికల్ కాలేజీల కోసం కేటాయించింది.

రైతులకు నేరుగా సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు కేబినేట్ సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్టాన్ని సవరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్ డివిజన్ ప్రకారం ప్రతి మ్యాప్ భూమికి మ్యాప్ తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బ తిన్న నేపథ్యంలో పర్యాటక ప్రాజెక్ట్ లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రీస్టార్ట్ ప్యాకేజీ కింద ప్రభుత్వం 198 కోట్ల రూపాయలు పర్యాటక ప్రాజెక్ట్ లకు ప్రభుత్వం సాయం అందించనుంది. హోటల్ రంగానికి 15 లక్షల రూపాయల వరకు రీస్టార్ట్ కోసం రుణం ఇవ్వడంతో పాటు తొలి ఏడాదికి 4.50 శాతం రాయితీతో ప్రభుత్వం రుణాలను మంజూరు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here