Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈనెల ఆరవ తేదీ వీరిద్దరూ ముఖాముఖి భేటీ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఎందుకు లేఖ రాశారు అందులో ఏముంది అనే విషయానికి వస్తే..

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది అయితే ఇప్పటివరకు కూడా విభజన హామీల విషయంలో ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల ఆరవ తేదీ ముఖాముఖి బేటిలో విభజన హామీల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది.
పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యలను చాలా శ్రద్ధతో, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
విభజన హామీలపై చర్చలు..
ఇక ఈ విషయాలు గురించి చర్చించిన తర్వాత రెండు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈనెల బేటీ కాబోతున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.





























