AP CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంతో ఆరోగ్యంగా చాలా ఫిట్ గా ఉంటారు. కరోనా సమయంలో కూడా ఈయన చాలా హెల్తీగా ఉన్నారు. అయితే జగన్ ఎప్పుడూ కూడా ఇలా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఆయన తీసుకునే ఆహారమేనని చెప్పాలి.అయితే జగన్ నిత్యం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు ఆయన ఫుడ్ మెనూ ఏంటి అనే విషయాన్ని ఏపీ టూరిజం మినిస్టర్ రోజా బయటపెట్టారు.

జగన్ గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నగరిలో పర్యటిస్తున్న సమయంలో తన ఫుడ్ మెనూ మొత్తం రోజాకు తెలిసిపోయిందని తాను ఎప్పుడు ఏమి ఆహార పదార్థాలు తీసుకుంటారు అనే విషయాన్ని ఈమె తెలియజేశారు. జగన్ గారు తన ఫుడ్ మెనూలో భాగంగా ఒక పుల్కా బాయిల్డ్ వెజిటేబుల్ మాత్రమే తీసుకుంటారట అలాగే వారానికి ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ తింటారని తెలిపారు.
ఇక రాయలసీమ స్పెషల్ అయినటువంటి చిత్రానం, మామిడి తురుముతో చేసిన పులిహోర అన్న కూడా జగన్ చాలా ఇష్టంగా తింటారని రోజా తెలిపారు. పల్లీలు మొక్కజొన్న పొత్తులు ఫ్రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటారని ఈమె తెలియజేశారు. ఇక జగన్ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఒక డ్రింక్ అని ఈమె తెలియజేశారు.

AP CM Jagan Mohan Reddy: జగన్ హెల్త్ డ్రింక్ అదేనా….
జగన్ గారు ఒక లీటర్ పాలలోకి పచ్చి అల్లం వేసి వాటిని బాగా మరిగించి ఒక గ్లాస్ పాలు తాగుతారని ఇదే ఆయన హెల్త్ డ్రింక్ అంటూ రోజా తెలియజేశారు.ఇలా పాలలోకి అల్లం మరిగించి తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విషయం మనకు తెలిసిందే. అయితే జగన్ హెల్త్ సీక్రెట్ కూడా అదేనని తాజాగా రోజా బయటపెట్టారు. ఇలా జగన్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్లే ఇలా హెల్తీగా ఉన్నారని చెప్పాలి.



































