ఆంద్రప్రదేశ్ లోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10 గంటల వరకు నమోదైన కోవిడ్ పరీక్షలలో కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1 పాజిటివ్ కేసులు నమోదయినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే కొత్తగా నమోదైన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి పెరిగినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుతం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులిటెన్ లో తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదుకాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల సంఖ్య :
- విజయనగరం – 0
- శ్రీకాకుళం – 0
- అనంతపురం – 2
- కర్నూలు – 4
- చిత్తూరు – 10
- తూర్పుగోదావరి – 11
- పశ్చిమ గోదావరి – 15
- విశాఖపట్నం 15
- ప్రకాశం – 18
- గుంటూరు – 23
- కడప – 23
- కృష్ణ – 27
- నెల్లూరు – 32
