AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్న విషయంపై చాలా ఉత్కంఠత ఏర్పడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం ఎవరిదనేది స్పష్టంగా తెలుస్తుందని భావించాము కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అందరిని అయోమయానికి గురిచేస్తున్నాయి.

జాతీయ సంస్థలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఫలితాలు రాగా స్థానిక సంస్థలు మాత్రం వైసిపికి అనుకూలంగా ఫలితాలను వెల్లడించాయి. దీంతో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఎగ్జిట్ పోలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ నేను ఒక జ్యోతిష్యుడిని జాతకాలు చూసే జ్యోతిష్యం చెబుతుంటాను రోజుకొక మాట మార్చడానికి నేను రాజకీయ విశ్లేషకుడిని కాదని తెలిపారు. నేను గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా గెలుస్తారు అంటూ ఈయన కుండబద్దలు కొట్టినట్టు తెలియజేశారు.
జగనే సీఎం..
జగన్మోహన్ రెడ్డి జాతకం రీత్యా ఆయనకు రాజకీయ యోగ్యం ఉందని ఆయన మరోసారి అధికారం చేపట్టబోతున్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు జాతకం ప్రకారం వారి జాతకంలో 2017 నుంచి 25 వరకు వీరికి శని ఉంది అంటూ తెలిపారు. ముఖ్యంగా టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ పార్టీది విజయమన్నట్టుగా వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























