AP Election Result: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా జూన్ నాల్గవ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని వైసిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా కోట్లలో బెట్టింగులు కూడా కడుతున్నారు.
మరోవైపు జూన్ 9వ తేదీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తామే అధికారంలోకి రాబోతున్నారని చాలా బలంగా నమ్ముతున్నారు.
అధికారం ఎవరిదీ…
ఇకపోతే ఈసారి జరిగిన పోలింగ్ సరళి చూస్తే అంచనాలు వేయడం కూడా కాస్త కష్ట తరమే అని చెప్పాలి. పోలింగ్ భారీ స్థాయిలో పెరగడం దేనికి సంకేతం అన్న విషయంపై అందరూ అయోమయంలో ఉన్నారు. అయితే నేడు సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్ కి కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.





























