Posani Murali Krishna: మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఈయనకు రాజకీయాలో సెట్ కావని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అనంతరం తిరిగి సినిమాలలో కొనసాగుతూ వచ్చారు.

ఇలా చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాల గురించి స్టేట్మెంట్లు ఇస్తూ వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలపై పోసాని కృష్ణ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అంటూ మాట్లాడారు. చిరంజీవికి ప్రజలు అంటే లెక్కలేదు ప్రజాసేవ అంటూ పార్టీని పెట్టారు. తర్వాత పార్టీ మూసేసి సినిమాలలో కొనసాగుతున్నారు. తన పార్టీ తరపున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు ఆయనకు రాజకీయం అంటే వ్యాపారం అని మండి పడ్డారు.
ఓటు అడిగే అర్హత లేదు..
ఈ విధంగా చిరంజీవి పార్టీని అమ్మేసి తనకు రాజకీయాలు వద్దని సినిమాలలోకి వెళ్లారు. ఇప్పుడు మరి రాజకీయపరంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత ఏమాత్రం లేదని తెలిపారు. చిరంజీవిని నమ్మి చాలామంది కాపులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు అంటూ ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























