Balakrishna: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగాయి. అయితే ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీ రాబోయే ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల అయ్యాయి.

ఈ ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా ఎక్కువ భాగం సర్వేలు కూటమి అధికారంలోకి రాబోతుందని అలాగే మరికొన్ని సర్వేలు వైసిపి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నియోజకవర్గంలో నుంచి గతంలో ఎన్టీఆర్ హరికృష్ణ వంటి వారి విజయం సాధించారు. అయితే గత రెండు సార్లు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎన్నికలలో విజయం సాధించారు. ఇక ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు .అయితే ఈసారి కూడా బాలయ్య విజయం సాధిస్తారని సర్వేలు తెలియజేస్తున్నాయి.
మూడోసారి అసెంబ్లీలోకి బాలయ్య..
ఇక బాలయ్య పై వైసీపీ నుంచి దీపికా పోటీకి దిగారు ఇక ఈమె కూడా స్థానికురాలు కాదు. ఇక బాలయ్య కూడా స్థానికులు కాకపోయినా ఆయన తరపున ఒక మేనేజర్ ని నియమించి హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. దీంతో హిందూపురం ప్రజలందరూ కూడా మరోసారి బాలయ్యకే పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని సర్వేలు చెబుతున్నాయి.





























