జగన్ సర్కార్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సమస్యలు వేగంగా పరిష్కారమవుతుందని, అభివృద్ధి జరుగుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ఏపీ కొత్త జిల్లాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలోని ఆర్ & బీ అథితి గృహం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయని.. జిల్లాల ఏర్పాటు సైతం ఇదే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే 25 జిల్లాలతో పాటు అరకును కూడా జిల్లా చేయనున్నామని రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలోనే సీఎం జగన్ అధికారంకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు.

అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడినా కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆ నిర్ణయం అమలు వాయిదా పడింది. అయితే జగన్ సర్కార్ మాత్రం మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల ఏర్పాటు కోసం కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ నివేదికను పరిశీలించి నివేదిక ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అరకు లోక్ సభ నియోకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లా మాత్రం రెండు జిల్లాలు కావడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here