ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చింది. తాజాగా జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అటవీ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది.

రాష్ట్ర అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో అటవీ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 శాతం సిబ్బంది కొరత ఉండగా ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉండగా అడవుల విస్తీర్ణం మరింత పెంచే దిశగా అటవీశాఖ అడుగులు వేస్తోంది.

జాతీయ అటవీ విధానం ప్రకాతం అటవీ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ జరగాల్సి ఉండగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. అటవీశాఖ ప్రస్తుతం 540 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం మరో 1,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఏపీపీఎస్సీ 1000 ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. కరోనా వైరస్ విజృంభణ తగ్గిన నేపథ్యంలో వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here