ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రాష్ట్రంలో 48 డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చేత రద్దు చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయనే కారణంతో ఈ కాలేజీలకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

ఉన్నత విద్యామండలి నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో రాష్ట్రంలోని కొన్ని డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీల అఫ్లియేషన్ లేదని.. మరికొన్ని కాలేజీలు విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు చేర్చుకుంటున్నామని, కొన్ని కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ కాలేజీలకు నోటీసులు జారీ చేశామని పేర్కొంది.
షోకాజ్ నోటీసులు జారీ అయిన కాలేజీల యాజమాన్యాలు విద్యామండలి నియమించిన కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని డిగ్రీ కాలేజ్ లలో ప్రోగ్రామ్ లను ప్రోగ్రామ్ లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నన్నయ యూనివర్శిటీ, నాగార్జున యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, కృష్ణా యూనివర్శిటీ, రాయలసీమ యూనివర్శిటీలోని పలు కాలేజీలకు అనుమతుల రద్దుతో పాటుషోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
వీటితో పాటు విక్రమ సింహపురి యూనివర్శిటీ, బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలకు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.



























