Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు ఒక సినిమా సెలబ్రిటీ మాత్రమే కానీ ఇప్పుడు ఈయన ఉపముఖ్యమంత్రి అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. జనసేన పార్టీని స్థాపించిన ఈయన ఈసారి ఎన్నికలలో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే విజయం సాధించి ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు.

ఈయన రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా వీలైనప్పుడల్లా సినిమాలలో నటిస్తున్న మరో వైపు రాజకీయాలలో చురుగ్గా ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రితోపాటు కీలక శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోవడంతో ఈయన ఇకపై సినిమాలు చేయరనే వాదన తెరపైకి వచ్చింది.
ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించరనే విషయం పక్కన పెడితే ఇప్పటికే ఈయన కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి అనే వాదన కూడా వినపడుతోంది కానీ మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతలను నెత్తిన వేసుకున్న పవన్ కళ్యాణ్ వాటిని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉంది. ఈ క్రమంలోనే తనకు వీలైనప్పుడు ఈ మూడు సినిమాలను పూర్తి చేసి ఇకపై సినిమాల జోలికి వెళ్ళరని తెలుస్తుంది.
శాశ్వతంగా సినిమాలకు దూరమా…
ఇలా పవన్ సినిమాల గురించి మెగా డాటర్ సుస్మిత కు ప్రశ్నలు ఎదురయ్యాయి. పరువు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలలో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు సుస్మిత సమాధానం చెబుతూ… అంత పెద్ద సబ్జెక్టు పై నన్ను క్లారిటీ అడుగుతున్నారా అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. మరి ఈయన అధికారంలో ఉన్నన్ని రోజులు సినిమాలకు దూరం అవుతారా లేకపోతే పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలలో కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.




























