AP politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్న పెద్దగా ఎక్కడ కూడా రీ పోలింగ్ చేసే పరిస్థితులు ఏర్పడలేదని చెప్పాలి. ఈ విధంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడమే కాకుండా ఊహించని విధంగా 78.5% పోలింగ్ జరగడంతో ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగిందని చెప్పాలి.

ఈ విధంగా ఎన్నికలు ముగిసిన అనంతరం అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందనే విషయాలను కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికలు జరిగిన శైలిని కనుక మనం గమనిస్తే పెద్ద ఎత్తున మహిళలు వృద్ధులు పోలింగ్ బూతుల వద్ద క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈసారి ఎన్నికలు చాలా టఫ్ గా ఉండబోతున్నాయని అందరూ భావించారు. కూటమి అలాగే వైసిపి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుందని కూడా భావించారు కానీ ఎన్నికలు మాత్రం అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీకి చాలా అనుకూలంగా మారాయని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారు అలాగే కులమత బేధాలు లేకుండా సంక్షేమాన్ని అందించారు.
వైసీపీదే అధికారం…
ఈ క్రమంలోనే ఈసారి ప్రజలందరికి మద్దతు కూడా అధికార పార్టీకే ఉందని తెలుస్తోంది.గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను విలేజ్ క్లినిక్లను గ్రౌండ్ లెవెల్ లో అభివృద్ధి చేసినటువంటి జగన్ ఈసారి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పై కూడా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తుంది.





























