సీఎం జగన్ కు నిమ్మగడ్డ ఝలక్.. వాళ్లతో చర్చలు పూర్తయ్యాయట…?

0
198

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ లేకపోతే రాష్ట్రంలో మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. అయితే ఊహించని విధంగా కరోనా విజృంభణ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సుముఖంగానే ఉన్నా జగన్ సర్కార్ కు మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు.

సాధారణంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఏపీలో ఎన్నికల కమిషన్, వైసీపీ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. జగన్ సర్కార్ ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరగకుండా ఈసీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోందని కామెంట్లు చేసింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఈరోజు ఎన్నికల నిర్వహణ గురించి అన్ని పార్టీల అభిప్రాయలను తీసుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. 11 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయని.. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో ఏపీలో కరోనా పరిస్థితులపై చర్చించామని అన్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ గురించి అభిప్రాయాలను తెలిపారని చెప్పారు.

రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో సీఈసీ విధానాన్నే అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించలేదని ఆరోపణలు చేయగా నిమ్మగడ్డ వారిని కూడా సంప్రదించినట్టు తెలపడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here