AR Rahman: ఏ ఆర్ రెహమాన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఈ ఆస్కార్ గ్రహీత. తమిళ ఇండస్ట్రీలో మొదలైన రెహమాన్ సంగీత ఝరి విశ్వ వ్యాప్తం అయింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ కూడా అందుకున్న విషయం మనకు తెలసిందే.

అయితే తాజాగా ఏ ఆర్ రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే రెహమాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. చెన్నైలో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెహమాన్ కూతురు ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలుస్తోంది.

అయితే ఖతీజా తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఆడియో, వ్యాపారవేత్త అయిన రియాసిద్దీన్ షేక్ మహ్మద్‌తో త్వరలో ఆమె నిఖా జరగనుంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖతీజా పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు ..
ఏఆర్ రెహమాన్ కు ఇద్దరు కూమార్తెలు కాగా… ఒక కుమారుడు ఉన్నాడు. ఖతీజా పెద్ద కూతురు కాగా చిన్నకూతురు పేరు రహీమా, కుమారుడి పేరు అమీన్ రెహ్మాన్. ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో రోబో సినిమాలో ’ మర మనిషి‘ పాటను పాడింది. ఆ తరువాత ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. మరో కుమార్తె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. అందుకు తగ్గట్లు నటనలో శిక్షణ తీసుకుంటుంది.





























