Archana Nag : హనీ ట్రాప్ ఈ పేరు తరచూ వింటూనే ఉంటాం. సాధారణ జనం నుండి పొలిటిషన్స్ వరకు ఎవరో ఒకరు ఈ ఉచ్చులో పడి ఇరుక్కున ఆనవాళ్లు చాలానే ఉన్నాయి. ఇపుడు తాజాగా ఒడిశాలో ఇలాంటి ఒక ఘటనే ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. ఒక్క ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతుంటే కలికాలంలో ఆడదాని వల్ల ప్రభుత్వాలు కూలిపోతున్నాయి . తాజాగా ఒడిశాలో ఒక కిలాడీ లేడీ చేతిలో మోసపోయి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బయపడ్డారు. వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఈ కిలాడీ లేడీ ఏకంగా కోట్లు కూడబెట్టింది.

పేద కుటుంబం నుండి కోట్లకు పడగలేత్తిన అర్చన….
ఒడిశా రాష్ట్రంలోని కాళహందీ లోని కేసింగా ఊరికి చెందిన అర్చన నాగ్ పేద కుటుంబం నుండి వచ్చింది. అయితే డబ్బు బాగా సంపాదించాలనే ఆశ బలంగా ఉన్న అర్చన ఒడిశా రాజధాని బుభనేశ్వర్ కి వచ్చి అక్కడ మొదట ఒక చిన్న ఉద్యోగం చేసింది. ఆపైన బ్యూటి పార్లల్ లో పనిచేసిన అర్చన అక్కడ పరిచయమైనా జగబందు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అర్చన భర్తకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండటం కారణంగా భర్తతో కలిసి వారిని ట్రాప్ చేయగలిగింది ఇంటికి భోజనంకి అని పిలిచి వారితో క్లోజ్ గా మూవ్ అయి ఆ వీడియోలను చూపి వారినే బెదిరించి డబ్బు లాగింది.

ఇలా ఎంతో మంది ఎమ్మెల్యే లు, మంత్రులు సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ఇలా సుమారు 50 మంది సెలబ్రిటీలు ఆమె ట్రాప్ లో పడ్డారు. నాలుగేళ్ళలోనే సుమారు 30 కోట్ల ఆస్తులు సంపాదించింది అర్చన. అయితే ఎప్పటిలాగే ఒక మంత్రిని ట్రాప్ చేయాలనీ అనుకుంటే ఆమె ప్లాన్ బేడీసికొట్టింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి అర్చన తనని బెదిరిస్తోందని ఫోన్లో రికార్డింగ్ చూపించారు. ఆలా పోలీసులు ఆర్చనను అరెస్టు చేయగా ఆమె లాప్ టాప్ అలాగే పెన్‌డ్రైవ్ లో చాలా మంది సెలబ్రిటీలా చీకటి బాగోతం బయటపడింది.































