మనం రోజూ తినే బియ్యంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.. క్యాన్సర్ కు కారకాం అయిన ఆర్సెనిక్ ఇందులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వరిలో ఆర్సెనిక్ అనేది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందని.. దీని వల్ల మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే అసలు బియ్యంలో ఆర్సెనిక్ అనేది ఎలా తయారు అవుతుందంటే.. ఆర్సెనిక్ సహజంగా తయారయ్యే ఒక మూలకం.

అది మట్టి, నీళ్లలో కూడా ఉంటుంది. ఆర్సెనిక్ విషపూరితం కావచ్చు. యూరోపియన్ యూనియన్ దీనిని మొదటి కేటగిరీ క్యాన్సర్ కారకాల జాబితాలో ఉంచిందట. వరి పొలాలకు నీళ్లు ఎక్కువగా ఉపయోగించడం దీనికి ప్రధాన కారణం. దానివల్ల ఆర్సెనిక్ మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి చేరడం చాలా సులభం అవుతుంది.
అయితే మామూలు బియ్యం కంటే బాస్మతి బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుందట. బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ అధిక స్థాయిలో ఉంటుంది. బియ్యపు గింజ చుట్టూ ఉండే పొట్టు దానికి కారణం. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. బియ్యాన్ని ఉపయోగించి మరికొన్ని పదర్థాలను తయారు చేస్తూ ఉంటారు.
ఇలా బియ్యంతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి అది ప్రమాదకరం కావచ్చు. కానీ మనం బియ్యాన్ని రాత్రంతా నానపెట్టి, తర్వాత రోజు శుభ్రమైన నీళ్లతో బాగా కడిగి వండినప్పుడు వాటిలోని ఆర్సెనిక్ స్థాయిని తగ్గించవచ్చు. అన్నం ఉడికించే సమయంలో కూడా మనం నీళ్లను మార్చితే అందులో ఆర్సెనిక్ స్థాయి తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.






























