సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

0
148

ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి వస్తువులను కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ లో ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల కొడుకు ఆన్ లైన్ చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఒక తల్లి కొడుకుకు సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిచ్చింది.

అయితే ఆ మహిళ కొనుగోలు చేసిన ఫోన్ ఎవరో దొంగతనం చేసిన ఫోన్ కావడంతో మహిళ ఒక రోజంతా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ మహిళ తాను డబ్బు చెల్లించి సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిందని చెప్పిన మాటలు నిజమేనని తెలియడంతో పోలీసులు ఆ మహిళను వదిలేశారు. మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బోరివ్లీలో నివశించే స్వాతి అనే మహిళ కుమారుని చదువుల కోసం రూ. 6 వేలు పెట్టి మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

ఆ తరువాత ఫోన్ లో కొన్ని సమస్యలు రావడంతో 1,500 రూపాయలు ఖర్చు చేసి స్వాతి ఫోన్ ను రిపేర్ చేయించింది. అయితే పోలీసులు ఆ ఫోన్ దొంగలించిన ఫోన్ కావడంతో స్వాతిని అరెస్ట్ చేశారు. ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో మహిళను ఫోన్ గురించి విచారించగా ఆ మహిళ తప్పేం లేదని తేలింది. స్వాతి మూడు నెలల కష్టపడి దాచుకున్న డబ్బుతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే కుమారుడి చదువులు సైతం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. స్వాతి తాను పని చేస్తున్న ఇంటి యజమానితో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని మోసపోతానని తన బాధను మొత్తం చెప్పగా ఇంటి యజమాని పోలీసులకు ఆ విషయాలను షేర్ చేశాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఆమె కుమారుడి చదువు కోసం మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here