అరియానా గ్లోరీ మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ పుణ్యమా అని అందరికీ ఈ పేరు బాగానే పరిచయం అయింది. పైగా అందులో కాస్త ఎక్స్ ట్రాలు కూడా బాగానే చేస్తుందంటూ ఓవర్ యాక్షన్ అరియానా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు కూడా.

ఈమె బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా గ్లోరీ అడుగు పెట్టి.. టాప్ 4 లో ఒక కంటెస్టెంట్ గా నిలిచారు. టెలివిజన్ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అరియానా 25 జనవరి 1993 హైదరాబాద్ లో జన్మించింది. 2015లో ఆమె యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్ అయ్యారు. ఈమె పేరు ఎక్కువగా పాపులర్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది.. అదే రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ. బోల్డ్ యాంకర్ గా ఆ రోజు నుంచే పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా పుష్ప సినిమాలో విడుదలైన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మామా పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా మంది ఈ పాటపై రీల్స్ చేశారు. అందులో అరియాన గ్లోరీ కూడా ఒకరు. బీట్‌కి తగ్గట్లు రొమాంటిక్ మూమెంట్స్‌తో మత్తెక్కించింది అరియానా. ఇక ఆమె అందాల ఆరబోత అయితే పీక్స్ అని చెప్పుకోవాలి. ఈ వీడియోను ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు వెరీ వెరీ హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా అరియనా ఈ సాంగ్ లో అందాలు ఆరబోసిందనే చెప్పాలి.






























