భారతీయ చిత్రకళా ఖండానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పడానికి 1938లో గీసిన కళాఖండమే నిదర్శనం అని చెప్పవచ్చు. భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ కుంచె నుంచి జాలువారిన చిత్రాలలో 1938లో గీసిన చిత్రం ఏకంగా 37.8 కోట్ల రూపాయల ధర పలకడం ఎంతో విశేషం. ఈ విధంగా భారతీయ చిత్రకళా ఖండం ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన రెండవ చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అదేవిధంగా అమృత గీసిన చిత్రాలలో అత్యంత ధర పలికిన చిత్రం కూడా ఇదే.

శాఫ్రాన్‌ఆర్ట్ సంస్థ నిర్వహించిన వేలం పాటలు అమృత గీసిన ఈ చిత్రం రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది. విదేశాలలో నివసించే అమృత తిరిగి ఇండియా యా చేరుకున్న కొంతకాలానికి గోరఖ్‌పుర్‌లోని తన కుటుంబ ఎస్టేట్ లో ఈ చిత్రాన్ని గీసింది.. ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ పేరుతో గీసిన ఆ కళాఖండంలో కొందరు మహిళలు వారి పనులలో నిమగ్నం అవ్వటం మనం ఈ కళాఖండంలో చూడవచ్చు.
ఈ విధంగా అమృత గీసిన చిత్రం వేలంపాటలో అత్యంత ధర పలకడంతో ఆమె కళానైపుణ్యం ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ చిత్రం అత్యంత ధరక పలకడంతో శాఫ్రాన్ఆర్ట్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు దినేశ్ వజిరానీ మాట్లాడుతూ… ఈ కళాఖండం ఒక చిత్రకారినిగా ఆమె ఎదుగుదలను తెలియజేస్తుంది. ఆమె గీసిన ఎన్నో చిత్రాలలో ఈ చిత్రం చిత్రలేఖనంలోనే ఒక అరుదైన భాగమని వారు వ్యాఖ్యానించారు.





























