Actress Prabhavathi : ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ప్రభావతి గారు ఆ తరువాత సినిమాల్లో అమ్మగా అత్తగా అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. సుమారు 150 సినిమాలను చేసిన ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే తాజాగా ఆమె బేబీ సినిమాలో హీరోకి తల్లిగా మూగ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ అలాగే బేబీ సినిమా విశేషాలను పంచుకున్నారు.

నా సీన్స్ చాలా పోయాయి…
బేబీ సినిమా చిన్న సినిమాగా వచ్చి ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ కు తల్లిగా ప్రభావతి గారు నటించారు. మూగ పాత్రలో నటించిన ఆమె ఆ పాత్ర ద్వారా చూసే ప్రేక్షకులకు కన్నీరు పెట్టించారు. అయితే సినిమాలో ఇంకా చాలా మంచి సీన్స్ ఉన్నా ఎడిటింగ్ లో పోయాయి అంటూ ప్రభావతి తెలిపారు. నాగబాబు, లిరీష కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయంటూ చెప్పారు.

ఇక నాటక రంగం నుండి వచ్చిన ప్రభావతి గారు మొదట్లో తాను తీసుకున్న పారితోషకం నూటపదహార్లు అంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలిపిన ప్రభావతి గారు రెమ్యూనరేషన్, షూటింగ్ లో కంఫర్ట్ ఇవి రెండు సరిగా ఉంటేనే తాను సినిమా చేస్తానంటూ చెప్పారు. రెమ్యూనరేషన్ తగ్గినా కంఫర్ట్ లేకుంటే చేయనంటూ తన అభిప్రాయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.