ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని సముద్రతీరంలో క్రూయిజర్ షిప్ లో రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ను NCB అధికారులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. అతనితో పాటు మరో ఎనిమిది మందిని కేసులో అరెస్టు చేశారు.

ఈ విషయం పై పలువురు సినీ సెలబ్రిటీలు చర్చిస్తూ షారుక్ తనయుడికి ఎప్పటినుంచో డ్రగ్స్ అలవాటు ఉందని,అయితే ఈ విషయం గురించి షారుక్ పట్టించుకోకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే షారుక్ అభిమానులు గతంలో ఆర్యన్ కి సంబంధించిన పలు పాత వీడియోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

2018లో షారూక్ తనయుడు ఆర్యన్, మలైకా అరోరా, ఇతర స్నేహితులతో కలిసి ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్యన్ కారు వద్దకు వెళ్లగానే అక్కడికి ఓ బిచ్చగత్తె చంటి బిడ్డతో అతని కారు వద్దకు పరుగులు పెట్టింది. ఆ బిచ్చగత్తెని చూసిన ఆర్యన్ ఏ మాత్రం విసుగు చెందకుండా తన పాకెట్ నుంచి కొంత డబ్బులు తీసి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన షారుక్ అభిమానులు తన పుత్రుడిపై పెద్దఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. బిచ్చగత్తె పట్ల అంతటి స్టార్ సెలబ్రిటీ కొడుకు ఈ విధంగా స్పందించడం విశేషం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్టు కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.































