Ariyana – Ashu Reddy: యూట్యూబ్ ఛానల్ యాంకర్లుగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అరియాన, అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో వీరిద్దరికీ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే వీరిద్దరు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఇద్దరు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటు ఉంటారు.

తాజాగా అరియనా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనగా ఇదే కార్యక్రమానికి అషు రెడ్డి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అషు రెడ్డి అరీయాన నడుముకు ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై స్పందిస్తూ ఏందయ్యా ఈ చండాలం అంటూ కామెంట్లు చేయగా… మరికొందరు ఏదో… తేడాగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.
తప్పుగా అనుకుంటారే…
అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో పై ఆరియాన స్పందిస్తూ… నీకు నీ క్రేజీనెస్ కి దండం తల్లి.. జనాలు తప్పుగా అనుకుంటారే… జడ్జిమెంట్ అవుతున్నాం అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ పై అషు రెడ్డి స్పందిస్తూ… జనాలు మంచిచెడులను జడ్జిమెంట్ చేస్తారు మనం వాటన్నింటిని వదిలేయాలి. ఇతరుల కన్నా మనం ప్రత్యేకంగా కనిపించాలనేది రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.






























