Ashu Reddy: అషురెడ్డి పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.హీరోయిన్లను మించి గ్లామరస్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈమె వ్యవహార శైలి కారణంగా పెద్ద ఎత్తున నేటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురైన ఈమె వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు తనపై వస్తున్నటువంటి ట్రోల్స్ కు తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు. ఇలా వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నటువంటి అషురెడ్డి తాజాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈమె తీవ్రస్థాయిలో మండిపడుతూ సదురు నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
ఈ సందర్భంగా అషురెడ్డి ను ఒక నేటిజన్ ప్రశ్నిస్తూ..ఈ మధ్య నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అది నీకు అర్థం కావడం లేదా? అని ఘాటైన సెటైర్ వేశాడు. సదరు సెటైర్ కి కౌంటర్ గా… అవును ఈ మధ్య పెరగడం కాదు తగ్గింది, అంటూ చెప్పు ఎమోజీ పోస్ట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ కు ఈమె చెప్పు చూపించినట్లు అయితే ఇలా ఈమె సమాధానం చెప్పడంతో సదరు నెటిజన్ మారు మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు.

Ashu Reddy:సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న అషు…
ఇలా ఈమె తన గురించి మాట్లాడిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ తాను ఈ సమాజం కోసం బ్రతకలేదని తనకోసం తాను తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నానంటూ ఈమె పరోక్షంగా తెలియజేశారు. మొత్తానికి అషు రెడ్డి చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరమైనప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసమే ఇలా గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున నేటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.































